![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఏడో వారం కొనసాగుతుంది. అయితే ఇందులో వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. కాగా ఇప్పుడు నామినేషన్లో ఉన్నవారిలో అశ్విని, పూజామూర్తి, టేస్టీ తేజ లీస్ట్ లో ఉన్నారు.
నలభై అయిదవ రోజు మైండ్ బ్లాక్ పాటతో మొదలైంది. పాటకి హౌస్ మేట్స్ అంతా అదిరిపోయే స్టెప్పులేసి రోజుని ప్రారంభించారు. ఆ తర్వాత టీ స్టాల్ బంటి గా అమర్ దీప్, అందమైన అమ్మాయిగా అశ్విని, అంబటి అర్జున్ రౌడీగా, అతనికి చెంచాగా పల్లవి ప్రశాంత్, విడిపోయిన భార్యభర్తులుగా శోభాశెట్టి, టేస్టీ తేజ, పెద్ద మనిషిగా శివాజీ వారి వారి పాత్రలలో పర్ఫామెన్స్ మొదలెట్టారు. అయితే మళ్ళీ స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో అటువైపు ఆట సందీప్, ప్రియాంక జైన్ స్ట్రాటజీతో గెలిచారు. ఇక ఇటు వైపు అమర్ దీప్, టేస్టీ తేజ అలా గెలవలేకపోయారు. అదంతా చూసిన శోభా శెట్టిలో మోనిత బయటకొచ్చేసింది. మాస్టర్ అండ్ ప్రియాంక ఫౌల్ ఆడుతున్నప్పుడు నువ్వు కూడా అలానే ఆడాలి కదా తేజ అని అడుగగా.. అది ఫౌల్ కదా నాకు అలా రాదని తేజ అంటాడు. దాంతో అలా రానప్పుడు ఎందుకెళ్ళావ్ అంటూ తెగ ఫీల్ అయిపోయింది.
ఆ తర్వాత బ్యాటరీ వైర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ మధ్యలో జరిగిన ఈ టాస్క్ లో స్వల్ప తేడాతో గౌతమ్ కృష్ణ గెలిచాడు. గేమ్ ముగిసాక బిగ్ బాస్ శోభా అనే పేరు రాసి ఒక కేకు పంపించాడు. దానికి ఒక వార్నింగ్ కూడా పంపించాడు. ముందుంది ముసళ్ళ పండగ తేజ అని వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్లో ఈసారి టేస్టీ తేజ చివర్లో ఉన్నాడు. బహుశా ఇది అతనికి ఒక హెచ్చరిక కావొచ్చు. మరి ఇది అర్థం చేసుకొని తేజ ఆడతాడో లేదో చూడాలి.
![]() |
![]() |